** ప్రీ మెట్రిక్ ఉపకార వేతనములు V th CLASS TO X th CLASS **
:::::SC/ST కులముల అభివృద్ధి శాఖ , వరంగల్ :::::
(FRESH & RENEWAL-2015-16)
SC/ST కులాల అభివృద్ధి శాఖ వరంగల్లు జిల్లా ద్వారా SC / ST కులమునకు చెందిన 5వ తరగతి నుండి 10వతరగతి విద్యార్ధిని విద్యార్ధులు పాటశాలలకు వెళ్ళక మధ్యలోనే చదువు మానివేయకుండా ఉండుటకు మరియు వారికి చదువు పై ఆశక్తి పెరుగుట కొరకు , ప్రభుత్వ ప్రీ మెట్రిక్ ఉపకార వేతనమును ఇవ్వాలని నిర్ణయించుట జరిగినది.
తదుకనుగుణంగా ప్రభుత్వ ఉత్తర్వులు నెం. 57 యస్. డబ్య్లు (E.D.N-2) తేది 02-07-2013 ప్రకారము ప్రభుత్వ స్థానిక సంస్థల , మున్సిపాలిటీల, కార్పోరేషన్ల ఆధ్వర్యంలో నడుపుచున్న SC/ST విద్యార్ధిని విద్యార్ధులకు ఒక్కొక్కరికి బాలికలకు (10)నెలలకు రూ. 1500/- చొప్పున బాలురకు ఒక్కొక్కరికి (10)నెలలకు రూ.1000/- చొప్పున ప్రీ మెట్రిక్ ఉపకార వేతనములు మంజూరు చేయుటకు ఉత్తర్వులు ఇచ్చియున్నారు.
అంతేకాక "రాజీవ్ విద్యా దీవెన పథకము" ద్వారా 9వ 10వ తరగతి చదువుతున్న SC/ST విద్యార్ధిని విద్యార్ధులు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనముల కొరకు దరఖాస్తు చేసుకోన్నచో వారిని కూడా ప్రీ మెట్రిక్ ఉపకార వేతనములు మంజూరు చేయబడును.
NOTE: OPEN THIS SITE EXPLORER & FIREFOX
కావలసిన ధృవీకరణ పత్రములు :
- ఆదార్ నంబరు
- విద్యార్థి బ్యాంకు అకౌంట్ (ఏదైన జాతీయ బ్యాంకులోనిది )
- కులము మరియు ఆదాయం ధృవీకరణ పత్రములు(మీ సేవ ద్వారా జారిచేయబడినవి) సంవత్సరమునకు ఆదాయం రూ॥ 2 లక్షల లోపు ఉండవలెను.
- రేషన్ కార్డు
- విద్యార్ధి ఫొటో
2015-16 విద్యా సంవత్సరమునకు పైన తెలిపిన విద్యార్ధిని విద్యార్ధుల యొక్క వివరములను మీ సేవ ద్వారా సంబంధిత విద్యార్ధిని విద్యార్ధులు తల్లిదండ్రులు,ప్రదానోపాద్యాయుల సహాయంతో స్కాలర్ షిప్ వెబ్ సైట్ "www.telangana epass.cgg.gov.in" లో నమోదు చేసి సదరు ప్రతిని పైన తెలిపిన జిరాక్స్ పత్రాలను జతపరిచి ఆయా పాటశాల ప్రదానోపాద్యాయులకు అందజేయవలసినదిగా కోరనైనధి . విద్యార్థులు అందజేసిన
ఉపకార వేతనముల దరఖాస్తులను సంబదిత పాటశాల ప్రదానోపాద్యాయులు పరిశీలించి వారి సంతకంతో జిల్లా సంక్షేమాదికరులకు అందజేసి మంజురుకు సహకరించవలెను. ఉపకార వేతనముల దరఖాస్తులను సంబదిత పాటశాల ప్రదానోపాద్యాయులు పరిశీలించి వారి సంతకంతో జిల్లా సంక్షేమాదికరులకు అందజేసి మంజురుకు సహకరించవలెను.
అప్లై చేయుట కొరకు "www.telangana epass.cgg.gov.in" వెబ్ సైట్ HOME పేజ్ లో "STUDENT SERVICES" పై క్లిక్ చేసినచో ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ వివరాలు తెలుసుకోవచ్చు.
SC/ST WELFARE OFFICE మరియు COLLECTOR & DIST,MAGISTRATE , WARANGAL
********************