రుద్రమ దేవి
రుద్రమదేవి కాకతీయుల వంశంలో ఒక ధ్రువతారగా వెలిగిన మహారాణి. కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులని తెచ్చిపెట్టిన వీరవనిత. భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమదేవి ఒకరు. ఈమె అసలు పేరు రుద్రాంబ. ఈమె తండ్రి గణపతిదేవునికి పుత్ర సంతానం లేదు. అందువలన రుద్రాంబను తన కుమారుడిలా పెంచుకొని రుద్రదేవుడని నామకరణం చేసాడు. గణపతిదేవుడు తన కుమర్తె రుద్రమదేవిని నిరవద్యపుర (నిడదవోలు )ప్రాంతాన్ని పాలిస్తున్న తూర్పు చాళుక్యుడైన వీరభద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు.రుద్రమదేవికి ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె ముమ్మడమ్మ. ఈమె మహాదేవుని భార్య. వీరి పుత్రుడే ప్రతాప రుద్రుడు. రుద్రమాంబ ప్రతాపరుద్రుని దత్తత తీసుకొని యువరాజుగా పట్టాభిషేకం చేసింది. ప్రతాపరుద్రునకు అన్నమదేవుడు అనే తమ్ముడు ఉండేవాడని స్థానిక గాథ. బస్తర్ రాజ్య చివరి పాలక వంశంవారు అన్నమదేవుని తమ వంశకర్తగా చెప్పుకున్నారు. రుద్రమదేవి రెండవ కుమార్తె రుయ్యమ్మను ఇందులూరి అన్నలదేవునికిచ్చి వివాహం చేసింది. అన్నలదేవుడు సేనాపతి మరియు మహా ప్రధాని.కాకతీయులలో అగ్రగణ్యుడైన గణపతిదేవుని తరువాత 1262 లో రుద్రమదేవి ' రుద్రమహారాజు ' బిరుదంతో కాకతీయ మహాసామ్రాజ్య సింహాసనాన్ని అధిష్టించింది. అయితే ఒక మహిళ పాలకురాలు కావటం ఓర్వలేని అనేకమంది సామంతులు తిరుగుబాటు చేసారు. అదేసమయంలో నెల్లూరు పాండ్యుల కింద, వేంగి ప్రాంతం గొంకరాజు మొదటి నరసింహుడి కిందకి వెల్లినయి...పాకనాటి కాయస్థ అంబదేవుడు, కళింగ నరసింహుని కుమారుడు వీరభానుడు తిరుగుబాట్లు చేసారు. రుద్రమ తన సేనానులతో కలిసి ఈ తిరుగుబాట్లనన్నిటినీ విజయవంతంగా అణచివేసింది. రుద్రమాంబ ఎదుర్కొన్న దండయాత్రలన్నిటిలోకీ దేవగిరి యాదవరాజుల దండయాత్ర అతి పెద్దది, కీలకమైనది. యాదవరాజు మహాదేవుడు ఓరుగల్లును ముట్టడించాడు, అయితే రుద్రమ యాదవలను ఓడించి, దేవగిరి దుర్గం వరకూ తరిమి కొట్టింది. వేరేదారి లేని మహదేవుడు సంధికి దిగివచ్చి, యుద్ధ పరిహారంగా మూడుకోట్ల సువర్ణాలు చెల్లించాడు. రుద్రమదేవి యొక్క శైవమత గురువు విశ్వేశ్వర శివశంబు. గణపతి దేవునికి, రెండవ ప్రతాపరుద్రునికి కూడా ఈయనే గురువు.
రాణీ రుదమ్మ చరిత్ర ఆదారంగా రుద్రమ దేవి సినిమా
రుద్రమ తానే స్వయంగా కాయస్త రాజ్యంపై దాడి చేసినట్లు తెలుస్తోంది. Chandupatla (నల్గొండ) శాసనం ఆధారంగా కాయస్త అంబదేవునితో జరిగిన యుద్ధాలలోనే మరణిచినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు.
రుద్రమదేవికి గల ఇతర బిరుదులు: రాయగజకేసరి, ఘటోదృతి.
ప్రఖ్యాత పథికుడు మార్కో పోలో ఛైనా దేశమునుండి తిరిగివెళ్ళుతూ దక్షిణభారత దేశము సందర్శించి రుద్రమదేవి గురించి, ఆమె పాలన గురించి బహువిధముల పొగిడాడు. మోటుపల్లి రేవునుండి కాకతీయుల సముద్ర వ్యాపారము గురించి కూడ వివరముగా వ్రాశాడు
ఈమె క్షత్రియ వంశo అనగా రాజ వంశమునకు చెందినది అని పూరణములు చెప్పుచున్నవి. గణపతిదెవుని తరువాత ఈమె ఆ వశము భాధ్యతలు స్వీకరించి ఆ వంశము యొక్క పేరును మరియు ప్రతిష్టను కపాడింది అని పురణములయందు లిఖించబడి యున్నది.
****
0 comments:
Post a Comment